ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు : చంద్రబాబు
తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని.. తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తెదేపా పార్టీ ప్రజల కోసం నిరంతరం పని చేస్తోందని పేర్కొన్నారు. కథానాయకునిగా, మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.
-
కథానాయకునిగా... మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.(2/2)#JoharNTR
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">కథానాయకునిగా... మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.(2/2)#JoharNTR
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2022కథానాయకునిగా... మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.(2/2)#JoharNTR
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2022
ఎన్టీఆర్ చరిత్ర నిత్య స్ఫూర్తిదాయకం. రైతు కుటుంబంలో పుట్టి తెలుగు జాతికే గుర్తింపు తెచ్చారు.చిత్రరంగంలో మకుటంలేని మహరాజుగా వెలుగొందారు. తిరుగులేని నేతగా ఆయన సేవలు మరువలేనివి. అధికారాన్ని బడుగువర్గాలకు చేరువ చేసిన నేత ఎన్టీఆర్. ఈ ఏడాది మార్చినాటికి పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి. 2023 మే 28న ఎన్టీఆర్ శతజయంతి జరుపుకోబోతున్నాం.ఈ రెండు సందర్భాలు తెలుగు ప్రజలకు అత్యంతముఖ్యం. -చంద్రబాబు
అవే ఎన్టీఆర్ ఆయుధాలు: లోకేశ్
తనకు ఎదురైన ప్రతి సవాలునూ సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి.. ఇవే ఎన్టీఆర్ ఆయుధాలని కొనియాడారు. అందుకే ఆయన ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకుని వ్యవస్థలను సంస్కరించగలిగారని, తెలుగుజాతి ముద్దుబిడ్డడు కాగలిగారని అన్నారు. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందుకుని... దొంగలు, దోపిడీదారులు, అహంకార దొరలు లేని అసలైన సర్వజన సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు మనందరం కృషిచేద్దాం.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందుకుని... దొంగలు, దోపిడీదారులు, అహంకార దొరలు లేని అసలైన సర్వజన సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు మనందరం కృషిచేద్దాం.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 18, 2022ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందుకుని... దొంగలు, దోపిడీదారులు, అహంకార దొరలు లేని అసలైన సర్వజన సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు మనందరం కృషిచేద్దాం.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 18, 2022
ఎన్టీఆర్‌ను భారతరత్నతో గౌరవించాలి: రఘురామ
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను భారతరత్నతో గౌరవించుకోవాలని ఈ సందర్బంగా ఆయన అన్నారు.
పేదలకు పండ్లు పంపిణీ..
విజయవాడ గొల్లపూడి గ్రామంలో.. స్థానిక తేదేపా నాయకులు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. గొల్లపూడి గ్రామ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయవాడ తేదేపా పార్లమెంటు ఉపాధ్యక్షులు బొమ్మసానీ సుబ్బారావు, పలువురు స్ధానిక తేదేపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: