ETV Bharat / city

Central Team Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన - కేంద్ర బృందం పర్యటన వార్తలు

భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం (Central Team visit at floods effected areas) రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి ఆస్తి, ప్రాణ నష్టాన్ని అంచనా వేయనుంది.

వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందం
వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందం
author img

By

Published : Nov 25, 2021, 8:42 PM IST

Updated : Nov 26, 2021, 4:39 AM IST

వరద నష్టం అంచనా వేసేందుకు.. కేంద్ర బృందం (Central Team tour in flood effected areas) రాష్ట్రానికి రానుంది. నేటి నుంటి మూడు రోజులపాటు.. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనుందని విపత్తుల శాఖ కమిషనర్​ కన్నబాబు తెలిపారు. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నారని వెల్లడించారు.

ముఖ్యమంత్రి జగన్ లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఈ మేరకు బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు.. రెండు బృందాలుగా విడిపోయి మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప, 28న నెల్లూరు జిల్లాల్లో పర్యటించి వరద నష్టం అంచనా వేస్తారు. 29న ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అవుతారు.

లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు: జీవీఎల్
ముఖ్యమంత్రి జగన్ సహాయం కోరిన వెంటనే.. కేంద్రం స్పందించి అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు(mp gvl news) స్పష్టం చేశారు. అయితే.. వరద సహాయక చర్యల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని జీవీఎల్‌ ఆరోపించారు. విపత్తు సహాయ నిధి కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు.

కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకోవాలనే ఉద్దేశ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రజల వద్దకు కాకుండా.. ప్యాలెస్ నుంచే రాష్ట్ర ప్రభుత్వ పాలన చేయాలని నిర్ణయించిందా? అని ప్రశ్నించారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి.. సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. బీసీ గణన తీర్మానంపై స్పందించిన జీవీఎల్.. తన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే బీసీ కులాల జనాభా లెక్కింపు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలన్నారు.

ఇదీ చదవండి

CBN: ఆ 60 మంది మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం: చంద్రబాబు

Last Updated : Nov 26, 2021, 4:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.