ETV Bharat / city

health grant: రాష్ట్రానికి రూ.488 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల

కేంద్రం రాష్ట్రానికి రూ.488.15 కోట్ల హెల్త్ గ్రాంట్(health grant) విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రస్తుతం ప్రతిపాదనలు పంపిన 19 రాష్ట్రాలకు రూ.8,453.92 కోట్లు ఇచ్చింది. తెలంగాణ సహా మిగిలిన 9 రాష్ట్రాలకు ప్రతిపాదనలు అందిన తర్వాత నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

money
money
author img

By

Published : Nov 14, 2021, 7:32 AM IST

కేంద్ర ఆర్థికశాఖ ఆంధ్రప్రదేశ్‌కు శనివారం రూ.488.15 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌(health grant) విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం(15th Financial Association) సిఫార్సుల మేరకు 28 రాష్ట్రాలకు కలిపి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.13,192 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రతిపాదనలు పంపిన 19 రాష్ట్రాలకు రూ.8,453.92 కోట్లు ఇచ్చింది. ఇది ఈ ఏడాది అన్ని రాష్ట్రాలకు కేటాయించిన దాంట్లో 3.7%. తెలంగాణ సహా మిగిలిన 9 రాష్ట్రాలకు ప్రతిపాదనలు అందిన తర్వాత నిధులు విడుదల చేస్తామని ఆర్థికశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

15వ ఆర్థిక సంఘం (15th Financial Association) 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి దేశంలోని స్థానిక సంస్థలకు రూ.4,27,911 కోట్ల గ్రాంట్‌ సిఫార్సు చేసింది. అందులో 70,051 కోట్లు హెల్త్‌ గ్రాంట్‌ కింద ఇచ్చింది. ఇందులో రూ.43,928 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలు, రూ.26,123 కోట్లు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని వైద్య ఆరోగ్యరంగానికి ఖర్చు చేయాలని సూచించింది. మొత్తం గ్రాంట్లలో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగ నిర్ధారణ మౌలిక వసతులకు 23.37%, గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్‌ స్థాయి ప్రజారోగ్య కేంద్రాల కోసం 7.53%, ఆరోగ్యకేంద్రాల నిర్మాణానికి 10.23%, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడానికి 21.56%, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగ నిర్ధారణ మౌలిక వసతుల కల్పనకు 2.99%, పట్టణ ప్రాంతాల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు 34.30% కేటాయించింది. అయిదేళ్లలో ఈ పద్దుకింద ఏపీకి రూ.2,601 కోట్లు దక్కుతుంది. తొలి రెండేళ్లు రూ.490 కోట్ల చొప్పున, మిగిలిన మూడేళ్లు రూ.514 కోట్లు, రూ.540 కోట్లు, రూ.567 కోట్ల మేర రాష్ట్రానికి గ్రాంట్‌ విడుదల కానుంది. ఈ మొత్తాన్ని ఆర్థిక సంఘం ప్రమాణాల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి

Kannababu: ఈ-క్రాప్ ద్వారా పంట నష్టపోయిన రైతులను గుర్తించాలి: కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.