వైరస్ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన విధానం పై దిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మహమ్మారిని జయించేందుకు రానున్న రెండు వారాలు అత్యంత కీలకమని..అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గౌబ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలుచేయాలని సూచించారు. క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ లో మరింత జాగ్రత్త వహించాలన్నారు. జిల్లాల్లో ర్యాఫిడ్ రెస్పాన్స్ బృందాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎస్, కలెక్టర్లను రాజీవ్ గౌబ ఆదేశించారు. ఇప్పటివరకూ పటిష్టంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నందుకు రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అభినందించారు.
ఇదీ చదవండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!