కరోనా గురించి సమాచారం పేరుతో సైబర్ దాడులు జరిగే అవకాశముందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. పోలీస్ విభాగాల్ని అప్రమత్తం చేసింది. సైబర్ నేరస్థులు ‘సెర్బెరస్’ అనే బ్యాంకింగ్ ట్రోజాన్‌ను చరవాణుల్లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇంటర్‌పోల్ పేర్కొంది.
కొవిడ్ గురించి అప్‌డేట్ సమాచారం అందజేస్తామనే సాకుతో ఈ ట్రోజాన్‌ను మాలిషియస్ లింక్‌ల ద్వారా పంపిస్తారని హెచ్చరించింది. ఒకవేళ ఆ లింక్‌లను చరవాణిలో ఇన్‌స్టాల్ చేసుకుంటే క్రెడిట్, డెబిట్‌కార్డుల నుంచి ఆర్థిక డేటాను దొంగిలించి డబ్బులు కొట్టేస్తారని హెచ్చరించింది.
ఇవీ చూడండి: