కృష్ణాజిల్లా విజయవాడ నుంచి గుడివాడ మార్గంలో ప్రయాణిస్తున్న పల్లెవెలుగు బస్సు మానికొండ-నందమూరు మార్గమధ్యలో అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ఒక్కసారిగా రోడ్డు అంచుకు వెెళ్లడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు.
ఇదీ చదవండి: అంబులెన్స్ కోసం రోజూ 9000 ఫోన్ కాల్స్!
సమాచారం అందుకున్న ఉంగుటూరు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చే ఏర్పాటు చేశారు. ప్రమాద సమయంలో మెుత్తం 31 మంది బస్సులో ఉండగా.. ఒకరిద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: