Bull Race: గుడివాడ కే కన్వెన్షన్ వేదికగా ఎన్టీఆర్ టు వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలు రెండోరోజు అహ్లాదకర వాతావరణంలో సాగుతున్నాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పూజలు చేసి ప్రదర్శనలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగ అంటే గుడివాడ అనేలా మంత్రి కొడాలి నాని సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ప్రదర్శనల్లో పాల్గొన్న పలు రాష్ట్రాలకు చెందిన పశు పోషకులకు ట్రస్ట్ తరఫున జ్ఞాపికలు అందజేశారు. రెండోరోజు ప్రదర్శనలు వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో రైతులు, పశుపోషకులు, వైకాపా నాయకులు తరలివచ్చారు.
ఇదీ చదవండి: Perni Nani On Cinema Tickets: సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా?: పేర్ని నాని