విజయవాడలో నాటువైద్యం పేరుతో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి కడప జిల్లాకు చెందిన బాలుడు మృతిచెందాడు. మరో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుద్ధిమాంద్యానికి చికిత్స అంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చిన నిందితుడు... గత నాలుగు రోజులుగా గవర్నర్‌పేట గంగోత్రి లాడ్జిలో ఉంటూ చికిత్స చేస్తున్నాడు. నాటువైద్యుడిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :