రాష్ట్రంలో కరోనా టెస్టులపై తెదేపా నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వారి విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 30వేల మందికి కరోనా టెస్టులు జరిగాయని ఆయన వెల్లడించారు.
సుమారు 9లక్షల కరోనా టెస్టులు
ఇప్పటివరకు సుమారు 9లక్షల కరోనా టెస్టులు రాష్ట్రంలో జరిగాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా టెస్టులు చేస్తున్నారు.విశాఖ వైద్యుడి వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతోంది. రోడ్డుపైకి వచ్చి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. గత ప్రభుత్వం ఎఎస్ఎంఈలకు వేల కోట్లు బకాయిలు పెట్టింది. పరిశ్రమలకు పెట్టిన బకాయిలు తీరుస్తుంటే విమర్శలు చేస్తున్నారు. బుధవారం 1088 కొత్త 104, 108 వాహనాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. జులై 8న 30లక్షల ఇళ్ల నిర్మాణాలను రాష్ట్రం ప్రారంభించబోతోంది. ఇళ్ల స్థలాలను స్వచ్చందంగా సేకరించాం. అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌కు భూముల కేటాయింపులు ప్రభుత్వం రద్దు చేసింది.నిర్ణీత సమయంలో పరిశ్రమ నెలకొల్పనందునే భూముల కేటాయింపు రద్దు చేశాం.భూముల రద్దుపై ప్రభుత్వం నిబంధనల మేరకే వ్యవహరించింది. - మంత్రి బొత్స
ఇదీ చదవండి: ప్రభుత్వ స్కీమ్‌లన్నీ స్కాంల కోసమే: చంద్రబాబు