ETV Bharat / city

ప్రభుత్వం సంపన్న వర్గాల కోసమే పనిచేస్తుందా..?: బొండా - ప్రభుత్వం సంపన్న వర్గాల కోసమే పనిచేస్తుందా

కరోనా సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపిందని... తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా మండిపడ్డారు. సినీ పరిశ్రమ పెద్దల థియేటర్లకు కరెంటు చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వం... ప్రజలకు ఎందుకు రద్దు చేయదని ప్రశ్నించారు.

ప్రభుత్వం సంపన్న వర్గాల కోసమే పనిచేస్తుందా?: బొండా ఉమా

author img

By

Published : Jun 23, 2020, 8:30 AM IST

సినీ పరిశ్రమ పెద్దల థియేటర్లకు కరెంటు చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రజలకు ఎందుకు రద్దు చేయదని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సంపన్న వర్గాల కోసమే పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందని ధ్వజమెత్తారు.

ఎన్నికల సమయంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి... అధికారంలోకి వచ్చాక కమీషన్​లకు కక్కుర్తిపడి సోలార్ పవర్, విండ్ పవర్​లు అధిక ధరలకు కొంటూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. తక్షణమే విద్యుత్ బిల్లులు రద్దు చేసి, ఉచితంగా 3 గ్యాస్ సీలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.