బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈఎన్‌టీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా టీఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్ ఫంగస్ సమస్య వస్తోందని డీఎంఈ తెలిపింది.
బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఈఎన్‌టీ సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేసింది. బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్లు డీఎంఈ పేర్కొంది. బ్లాక్ ఫంగస్ బాధితులకు పూర్తిగా కోఠి ఈఎన్‌టీలో చికిత్స అందించనున్నట్లు తెలిపింది. బ్లాక్ ఫంగస్‌కు వాడే ఔషధాలు సమకూర్చాలని టీఎస్ఎంఐడీసీకి తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
ఇదీచదవండి: భారత్‌కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?