అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలపై భాజపా దృష్టి సారిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భాజపాను ఎంపీకి లీజ్‌కు ఇచ్చారని ఎవరో మాట్లాడారని, తమ పార్టీని ఎవరికీ లీజ్‌కు ఇవ్వలేదని అన్నారు.
తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన వారికి ఎలాంటి లీజులిచ్చారో చెప్పమంటారా? అని ప్రశ్నించారు. ఏపీలో రాజకీయ శూన్యత ఉందన్న సోము వీర్రాజు.. ఇకపై భాజపా దూకుడుగా వెళ్లబోతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై భాజపా పోరుబాట పట్టబోతోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
మా పార్టీని ఎంపీకి లీజ్‌కు ఇచ్చామని ఎవరో మాట్లాడారు. భాజపాను ఎవరికీ లీజ్‌కు ఇవ్వలేదు. తెదేపా, వైకాపా నేతలు ఎవరు ఎవరికి లీజుకిచ్చారో నాకు తెలుసు. మీ లీజ్‌ల గురించి మేం మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయి. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీచదవండి.