MP GVL Fire On YSRCP: కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ‘వైసీపీ అంటే.. ఏమీ చేతగాని ప్రభుత్వం’ అనేలా తయారైందని ఎద్దేశా చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈమేరకు దిల్లీలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.
MP GVL Fire On CM Jagan:‘‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం నిధులివ్వకపోవడంతో కేంద్ర నిధులూ రావడం లేదు. వైకాపా చేతకానితనంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగింది. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ నిధులు ఇచ్చింది ఏపీకే. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఓటీఎస్ పేరుతో కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక వైఫల్యానికి కేస్ స్టడీలా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉంది’’ అని జీవీఎల్ ఆరోపించారు.
ఇదీ చదవండి..
BJP leaders comments on YSRCP: రాష్ట్రంలో ఆటవిక సంస్కృతి తీసుకొస్తున్నారు : బీజేపీ