16వ శతకానికి చెందిన సుప్రసిద్ధ కవి, సంగీత గంధర్వుడు, ప్రముఖ రామ భక్తుడు, స్వామి భక్త రవి దాస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర భాజపా కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భక్త రవి దాస్ చిన్నతనంలోనే అవమానకర, దుర్భర జీవితాన్ని గడిపారని నేతలు గుర్తు చేసుకున్నారు.
ఆయన్ను ఆలయ ప్రాంగణంలోకి కూడా అనుమతించే వారు కాదని.. అయినా భక్త రవి దాస్ ఎప్పుడూ నిరాశ పడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, కోశాధికారి వామరాజు సత్యమూర్తి, బిట్ర శివన్నారాయణ, పాలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: