ఉత్పాదక వ్యయంపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం కల్పించే సాయం కోల్పోయే ప్రమాదముందని.. భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ అన్ని రంగాలకు ఊతం ఇచ్చే విధంగా ఉందని ఆయన అన్నారు. బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరు నిర్లిప్తంగా ఉంటే.. రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయో అవకాశముందని వెల్లడించారు. అన్ని ప్రధాన శాఖల్లో బడ్జెట్ కేటాయించారని.. మ్యాచింగ్ గ్రాంట్ లను బట్టి రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ తీసుకోవచ్చని.. దీనిని అన్ని శాఖల్లో రాష్ట్రం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. లేకుంటే రాష్ట్రాలు వెనుకబడే అవకాశం ఉందన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి రింగ్ రోడ్డు అనుమతి మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. ఇలాంటివి జరగకుండా కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ను ఉపయోగించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి:
HC on PRC: ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దు: హైకోర్టు