ETV Bharat / city

అమరావతి రాజధానికే మా మద్దతు : కన్నా

మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని భాజపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna On Repeals Three Capitals Act) స్వాగతించారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అవగాహనారాహిత్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయమన్నారు. దాన్ని తాము మెుదటి నుంచి వ్యతిరేకిస్తున్నే ఉన్నామని తెలిపారు.

Kanna On Repeals Three Capitals Act
3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం శుభపరిణామం
author img

By

Published : Nov 22, 2021, 5:20 PM IST

Updated : Nov 22, 2021, 8:11 PM IST

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించటాన్ని భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనాారాయణ (Kanna Laxmi Narayan on repeal three capital bill) స్వాగతించారు. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ నిర్ణయంపై మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై కన్నా మండిపడ్డారు. ఇది ఇంటర్వెల్ అని మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారని..,అలా మాట్లాడితే ప్రజలు మీకు శుభం కార్డు వేస్తారని హెచ్ఛరించారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అవగాహనారాహిత్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయమన్నారు. దాన్ని తాము మెుదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రలో భాజపా నేతలంతా పాల్గొనటం కూడా ఈ నిర్ణయానికి కారణం కావొచ్చని కన్నా అభిప్రాయపడ్డారు.

పెద్దిరెడ్డి ఏమన్నారంటే..

ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి(minister peddireddy on ap 3 capitals law withdraw) మాట్లాడుతూ..ఇది ఇంటర్వెల్‌ మాత్రమేనని శుభం కార్డుకు మరింత సమయం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని.. చట్టం ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ (AP ministers on repeals of ap 3 capitals act) కాదన్నారు. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని మంత్రి ఉద్ఘాటించారు. అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్‌ ఆర్టిస్టుల పాదయాత్రగా అభివర్ణించిన మంత్రి పెద్దిరెడ్డి..రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా ? అని ప్రశ్నించారు.

మూడు రాజధానులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

మూడు రాజధానుల విషయం(ap Three Capitals Act)పై రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని (ap govt withdrew Three Capitals Act) వెనక్కి తీసుకుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబధించిన మూడు రాజధానుల చట్టం రద్దు బిల్లును కేబినెట్​లో ఆమోదించారు. ఇదే విషయాన్ని.. అమరావతి కేసుల్లో జరుగుతున్న రోజువారీ విచారణలో భాగంగా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు.

ఇదీ చదవండి

Peddireddy on 3 capitals repeal bill: చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

Last Updated : Nov 22, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.