INDRAKEELADRI: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ కోసం భక్తులు తరలివస్తున్నారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహణ కోసం దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, పాలకమండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. 40 ఏళ్ల క్రితం తొమ్మిది మందితో ప్రారంభమైన భవానీ దీక్షల్లో.. ఇప్పుడు లక్షల మంది పాల్గొంటున్నారు. ఈ రోజు శాస్త్రోక్తంగా హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠాపన అనంతరం దర్శనానికి భవానీలను అనుమతిస్తామని ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తెలిపారు.
26వ తేదీ నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 29వ తేదీ మహా పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షా విరమణ మహోత్సవాలు పూర్తవుతాయని అన్నారు. సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: