ETV Bharat / city

బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో.. పార్టీ 'పునఃరంకిత సభ' - బెంగుళూరు టీడీపీ ఫోరం వార్తలు

తెదేపా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ.. బెంగళూరు తెదేపా ఫోరం ఆ నగరంలో పునఃరంకిత సభ నిర్వహించింది. తెదేపా నేతలు అమరనాథ్‌ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందని.. తెదేపా అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని అమర్‌నాథ్‌రెడ్డి హెచ్చరించారు.

బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ 'పునఃరంకిత సభ'

author img

By

Published : Mar 27, 2022, 8:11 PM IST

బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ 'పునఃరంకిత సభ'

తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఈ నెల 29వ తేదీకి 40 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో బెంగళూరులోని క్రిష్ణా సమ్మిట్​లో 'పునఃరంకిత సభ- నలభై సంవత్సరాల ప్రస్థానం' పేరిట పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వైకాపా అరాచక పాలన వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని.., తమ ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలూ సరిచేస్తామని అన్నారు. తప్పుడు కేసులకు భయపడాల్సిన పనిలేదని అన్నింటికీ తమ ప్రభుత్వం వచ్చాక సమాధానం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పత్తిపాటి ఆంజనేయులు, కర్ణాటక తెదేపా కో-ఆర్డినేటర్ రావి మోహన్ చౌదరి, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. సభా ప్రాంగణం జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నినాదాలతో మార్మోగింది.

ఇదీ చదవండి: వైకాపా పాలకులకు కూల్చడం తప్ప, కట్టడం రాదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.