ETV Bharat / city

పోలీసుల ఆంక్షలతో బోసిబోయిన బందర్​ రోడ్డు - ప్రజలు బయటకు రాక విజయవాడలో బోసిపోయిన బందర్​ రోడ్డు

నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించగా.. విజయవాడలోని బందర్​ రోడ్డు బోసిపోయింది. నగరంలోని ఇతన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడికక్కడ పోలీసులు పికెటింగ్​లు నిర్వహిస్తూ.. చిన్న చిన్న రోడ్లనూ మూసివేశారు. నగర సీపీ ప్రధాన రహదారులపై పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

no man on roads
బోసిపోయిన విజయవాడ రోడ్లు
author img

By

Published : Jan 1, 2021, 6:39 AM IST

కరోనా నేపథ్యంలో నగరంలో నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు విధించగా.. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రతీ ఏడాదీ నగరవాసులతో కిక్కిరిసిపోయే బందర్ రోడ్డు.. ఈసారి బోసి పోయింది. వాహనదారులు రాకుండా ఎక్కడిక్కడ పోలీసులు పికెటింగ్​లు ఏర్పాటు చేశారు. రహదారులకు ఇరువైపుల ఉన్న రోడ్లు బారికేడ్లతో మూసేశారు. ఇవన్నీ దాటుకుని కొందరు చిన్న చిన్న వీధుల్లో నుంచి రోడ్లపైకి వచ్చినా.. పోలీసులు వారిని వెనక్కి పంపారు. ప్రార్థనా మందిరాలకు మాత్రమే అనుమతినిచ్చారు.

విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు.. నగరంలోని ప్రధాన రహదారులపై పర్యటించారు. నగరవాసులు సహకారంతోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేలా చేయగలిగామని తెలిపారు. కొత్త రకం కరోనా వ్యాపిస్తున్న క్రమంలో అనేక మంది తమ గృహాల్లోనే వేడుకలు జరుపుకున్నారు.

ఇదీ చదవండి:

'రామతీర్థం ఘటనపై మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.