ఏపీ ట్రాన్స్‌కోతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు 6 నెలల పాటు సమ్మెకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎసెన్షియల్ సర్వీసెస్ నిర్వహణ చట్టం 1971( ఎస్మా)లోని సెక్షన్ 3 ప్రకారం మూడు విద్యుత్ పంపిణీ సంస్థల్లోనూ సమ్మెలను ఆరు నెలల పాటు నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాల రీత్యా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా సమ్మెలను నిషేధిస్తున్నట్టు ఇంధన శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇదీ చదవండి: ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్