రాష్ట్రంలో 2 నెలల పాటు సముద్ర తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి కాలంలో మత్స్య ఉత్పత్తుల సంరక్షించేందుకు గానూ ఈ నిషేధాజ్ఞల్ని విధిస్తూ మత్య్సశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 తేదీ వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మొత్తం 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం కొనసాగుతుందని మత్స్యశాఖ ప్రకటించింది.
సంప్రదాయ బోట్లు మినహా మోటారు, మెకనైజ్డ్ బోట్లన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని మత్య్సశాఖ స్పష్టం చేసింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే బోట్లు స్వాధీనం చేసుకుంటామని.. తదుపరి డీజిల్ రాయితీలను నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిషేదాజ్ఞల పర్యవేక్షణకు రాష్ట్ర మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు దళానికి మత్స్యశాఖ సమాచారం పంపింది.
ఇవీ చదవండి: