విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ మహామండపంలో శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, ఈవో భ్రమరాంబ తదితరులు పూజలు నిర్వహించారు.
భవానీభక్తులు జై దుర్గా.. జై జై దుర్గా అంటూ మాలధారణ చేశారు. ఇవాల్టి నుంచి ఈనెల 19 వరకు మండలదీక్ష మాలధారణ జరగనుంది. వచ్చేనెల 5 నుంచి 9 వరకు అర్ధమండల దీక్షల కోసం మాలధారణ జరగనుంది. డిసెంబరు 18 సాయంత్రం 6:30 నుంచి కళశజ్యోతి మహోత్సవం- డిసెంబరు 25 నుంచి 29 వరకు దీక్ష విరమణలు ఉంటాయని ఆలయ పండితులు తెలిపారు.
ఇదీ చదవండి: