ETV Bharat / city

సాంకేతిక విద్య ప్రవేశాలలో కొరవడిన స్పష్టత... విదార్థులకు తప్పని నిరీక్షణ - డిగ్రీ ప్రవేశాలు తాజా వార్తలు

సాంకేతిక విద్య ప్రవేశాలకు రోజుల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. కళాశాలలు, సీట్ల ఎంపిక కోసం దాదాపు 85వేల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. బోధనా రుసుములు, కళాశాలల జాబితా విడుదలలో జాప్యం కారణంగా మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. డిగ్రీ ప్రవేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సాంకేతిక విద్య ప్రవేశాలలో కొరవడిన స్పష్టత

author img

By

Published : Dec 1, 2020, 5:39 PM IST

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చి నెల రోజులు గడిచినా... ఇంతవరకు కళాశాలలు, బోధన రుసుములను ఉన్నత విద్యా శాఖ ప్రకటించలేదు. దీంతో కళాశాలలు, సీట్ల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. నిబంధనల ప్రకారం రుసుములు, కళాశాలలు, సీట్ల సంఖ్య తేలిన తర్వాత కౌన్సెలింగ్‌కు ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. ముందుగానే కౌన్సెలింగ్‌ చేపట్టారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండానే రుసుములు, కళాశాలల సీట్లను నిర్ణయించాలని అధికారులు భావించారు. వీటిల్లో జాప్యం జరగడంతో కౌన్సెలింగ్‌ ప్రహసనంగా మారింది. ఇప్పటికే ప్రాసెసింగ్‌ రుసుము, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు కోసం గత కొన్ని రోజులుగా ఎదరుచూస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాల ప్రక్రియ ముగిసినా... రాష్ట్రంలో మాత్రం మొదటి విడత కౌన్సెలింగ్‌పైనే స్పష్టత రావడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసీటీఈ డిసెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రకటించింది. ఆ గడువు నేటితో ముగిసింది. అయినా... కళాశాలల బోధన రుసుములపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోగా... అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల సంఖ్యను ప్రకటించలేదు.

ఇంజినీరింగ్, బీఫార్మాసీలో ప్రవేశాలు పొందేందుకు 85,702మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వీరందరూ కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల కోసం నిరీక్షిస్తున్నారు. ఐచ్ఛికాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని విద్యార్థులు ఫోన్లు చేస్తున్నా... అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కరవైంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్​కు అక్టోబరు 23న ప్రకటన ఇచ్చారు. మొదట 27 వరకు ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. ఈ గడువు పూర్తికావడంతో మరోసారి నవంబరు 3 వరకు పొడిగించారు. అప్పటికీ బోధన రుసుములు, కళాశాలల జాబితా సిద్ధం కాకపోవడంతో చివరికి ధ్రువపత్రాల పరిశీలన నిలిపివేశారు. సహాయ కేంద్రాలను మూసివేశారు. జేఎన్‌టీయూ, కాకినాడ ఇంతవరకు అనుబంధ గుర్తింపు కళాశాలలు, సీట్ల వివరాలను కన్వీనర్‌కు అందించలేదు. రాష్ట్రంలో ఎక్కువ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగానే ఉన్నాయి.

ఈ ఏడాది నుంచి డిగ్రీ ప్రవేశాలను కూడా ఆన్‌లైన్‌ చేశారు. కళాశాలలకు ఉన్నత విద్య నియంత్రణ..,పర్యవేక్షణ మండలి మొదటిసారిగా బోధన రుసుములను ఖరారు చేసింది. వీటిని నిర్దారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా... ఇంతవరకు విడుదల కాలేదు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ సీట్ల కేటాయింపు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్‌పై స్పష్టత లేనందున డిగ్రీ ఎప్పుడనేది తెలియని పరిస్థితి. దీంతో డిగ్రీలో చేరాలనుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లోను ఉత్కంఠ నెలకొంది.

ఇదీచదవండి

ఉపాధి మార్గం.. తితిదే శిల్ప కళాశాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.