కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశమంతా లాక్డౌన్ విధించారు. ఈ క్రమంలో వలస కూలీలు, యాచకులు నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్నారు. మానవతా ధృక్పథంతో ముందుకొస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు...వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నాయి. విజయవాడ నగర పరిధిలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరాశ్రయులైన వారికి భోజనాన్ని అందిస్తున్నారు. భోజనం అందించే సమయంలో సామాజిక దూరంపై అవగాహన కల్పిస్తూ..వారి ఆకలిని తీరిస్తున్నారు. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ...ఒక్కొక్కరుగా భోజనాన్ని స్వీకరిస్తున్నారు. నగరంలో ఎవరైనా భోజనానికి ఇబ్బంది పడితే 9849186233 , 9701111545 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు. వెంటనే భోజన వసతి కల్పిస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచదవండి