సమాజంలో స్వీయ చరిత్రలు, ఆత్మకథలకు విశిష్ట స్థానం ఉందని ప్రముఖ రచయితలు పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు, జీవిత కథల గురించి చర్చించింది చాలా తక్కువ అని.. ఆత్మకథలు దశాబ్దాల కిందటి నాటి సామాజిక స్థితిగతులు, ప్రజల జీవిత విధానాలను తెలియజేస్తాయన్నారు. 50 ఏళ్లు, వందేళ్ల నాటి పరిస్థితులు ఆత్మకథల ద్వారానే తెలుసుకోగలమని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ వంటివాటి ద్వారా ప్రజల్లో ఆత్మకథల పట్ల ఉత్సుకత పెరిగిందని.. ఆత్మకథలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం తెలుగు సాహిత్యంలో ఉందని వక్తలు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు