గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో పేదల ఇళ్లు కూలగొట్టకుండా తెలుగుదేశం పోరాడుతుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు బాధితులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమమూ చేపట్టని ప్రభుత్వం... విధ్వంసమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆత్మకూరు గ్రామస్థులు చంద్రబాబును కలసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో తమ గ్రామం నుంచి వైకాపాకు ఓట్లు పడలేదని కక్షతో తమ గృహాలను కూలగొట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఈసమస్యపై ఎమ్మెల్యేను కలసి విన్నవించుకున్నా.. తనకు సంబంధం లేదన్నారని వారు వాపోయారు. ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా.. అధికారులు లెక్కచేయటం లేదని ఆవేదన చెందారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నా.. తమ జోలికి ఏ ప్రభుత్వం రాలేదని.. ఇప్పుడే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని కన్నీరుమున్నీరు అయ్యారు.
ఇదీ చదవండి: