ETV Bharat / city

చంద్రబాబుపై నెపం నెట్టి తప్పించుకోవాలనుకోవడం సిగ్గుచేటు: అచ్చెన్నాయుడు - తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజా వార్తలు

పులిచింతల గేటు ఊడిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఒక వైపు 90 శాతం పనులు రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయంటూనే.. మరోవైపు చంద్రబాబు నాయుడుపై నెపం నెట్టి తప్పించుకోవాలనుకోవడం సిగ్గుచేటన్నారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు
author img

By

Published : Aug 7, 2021, 7:44 PM IST

పులిచింతల గేటు ఊడిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఒక వైపు 90 శాతం పనులు రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయంటూనే మరోవైపు చంద్రబాబు నాయుడుపై నెపం నెట్టి తప్పించుకోవాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ఒలంపిక్స్​లో బురద జల్లే క్రీడ పెడితే వైకాపా నేతలు దేశానికి అత్యధిక గోల్డ్ మెడల్స్ తెచ్చేవారని ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగినా..పులివెందులలో జగన్ రెడ్డి ఇంటి గేటు విరిగినా అది చంద్రబాబు నాయుడే కారణమని బురద జల్లడం వైకాపా నాయకులకు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు.

వైఎస్ కుటుంబం జలయజ్ఞం పేరుతో చేసిన ధనయజ్ఞానికి పాల్పడటంతో నేడు రాష్ట్రంలో ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్లల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణకు చేసిన వ్యయం శూన్యమని తెలిపారు. ఏసీ రూముల్లో సమీక్షల పేరుతో కాలయాపన చేయడం తప్పా ప్రాజెక్టులను సందర్శించిన పాపాన పోలేదన్నారు. పులిచింతల పూర్తి చేసిన ఘనత వైఎస్​దే అని.. అక్కడ 45 అడుగుల వైఎస్ విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 07, 2019న మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి కూడా ఆ ఘనత తమదే అంటూ విజయవాడలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Flash: విహారయాత్రలో విషాదం..నీటిలో మునిగి నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.