తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు మీకు ఇబ్బంది కలిగించడం లేదా అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. ఇటీవల కాలంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని కేసీఆర్ అన్నారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కక్ష రాజకీయాలు మాని ప్రగతి రాజకీయాలతో సమర్థవంతమైన పాలన అందించాలని తులసిరెడ్డి సీఎం జగన్కు సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్-2 పంచాయతీరాజ్ చట్టానికి, 73వ రాజ్యాంగ సవరణ స్పూర్తికి విఘాతం కలిగిస్తోందని తులసి రెడ్డి విమర్శించారు.
ఇదీ చదవండి: