ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి నేతృత్వంలో ఈ సెలక్షన్ కమిటీని నియమిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక కమిటీ ఛైర్మన్గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ను ఎంపిక కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ ఎంపిక కోసం ఇద్దరి పేర్లను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.
ఇదీ చదవండి