Rains: నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలతోపాటు అరేబియా సముద్రం, ఆగ్నేయ, నైరుతి, ఈశాన్య బంగాళాఖాతం మీదుగా విస్తరిస్తున్నాయి. ఇవి మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి.
వీటి ప్రభావంతో.. బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. మరోవైపు నిప్పుల కుంపటి ముందు నిల్చున్నట్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది
ఇవీ చూడండి: