గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో ఏపీ నుంచి లేపాక్షి శకటం కనువిందు చేయనుంది. 16వ శతాబ్ధంలో విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలికి చెందిన లేపాక్షి నందితో పాటు ఆలయాన్ని ప్రతిబింబిస్తూ ఇతర కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేలా శకటాన్ని రూపొందిస్తున్నారు. లేపాక్షి ఆలయంలోని శివపార్వతుల కల్యాణ ఘట్టం వివరించే శిల్పాలు, శివలింగం ప్రతిరూపాలు శకటంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దక్షయజ్ఞంలో వీరభద్రుని కథను ప్రతిబింబించేలా వీరనాట్య ప్రదర్శన కూడా శకటంలో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీచదవండి: 'నాపై దాడికి మంత్రి కొడాలి నాని రౌడీలను సిద్ధం చేశారు'