రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. విజయవాడలోని రెవెన్యూ ఉద్యోగుల భవన్లో ఈ ప్రక్రియను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలతో పాటు సీసీఎల్ఏ నుంచి ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే హాజరు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.
ఆ మేరకే... కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్యవర్గంలో భాగంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, సభ్యుల ఎన్నిక కోసం ఒక బృందం మాత్రమే నామినేషన్లను దాఖలు చేసింది. ఈ కారణంగా... రెవెన్యూ ఉద్యోగుల సంఘం అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఇదీ చదవండి: