ETV Bharat / city

'ఏపీలో ఎల్​కేజీ కంటే ఇంజినీరింగ్‌ ఫీజులే తక్కువగా ఉన్నాయి' - Engineering College fees news in ap

ఇంజినీరింగ్‌ కళాశాలల ఫీజులు పెంచకపోతే విద్యా సంస్థలను నడపలేమని కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. ఎల్​కేజీ కంటే ఇంజినీరింగ్‌ ఫీజులే తక్కువ ఉన్నాయని వాపోయాయి. 2007లో నిర్ణయించిన ఫీజులే ఇప్పటికీ ఉన్నాయని ఇలాగైతే అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని.. ప్రైవేట్‌ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

'ఏపీలో ఎల్​కేజీ కంటే ఇంజినీరింగ్‌ ఫీజులే తక్కువగా ఉన్నాయి'

author img

By

Published : May 26, 2022, 6:00 AM IST

'ఏపీలో ఎల్​కేజీ కంటే ఇంజినీరింగ్‌ ఫీజులే తక్కువగా ఉన్నాయి'

విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌తో... ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కళాశాలల యాజమాన్యాలు తమ ఇబ్బందులను ప్రభుత్వానికి వివరించాయి. సీఎం జగన్‌ పాదయాత్రలో 70వేల రూపాయల ఫీజు లేనిదే.. కళాశాలలు ఎలా నిర్వహిస్తారని చెప్పారని యాజమాన్యాలు గుర్తుచేశాయి.

కానీ ఇప్పుడు ఫీజుల నిర్ణయం సరిగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి. ఫీజులను ప్రతి మూడేళ్లకు ఒక సారి 25శాతం పెంచాల్సి ఉండగా.. 35శాతం తగ్గించటాన్ని వారు తప్పుబట్టారు. మంచి ఫీజులు ఇస్తే నాణ్యమైన విద్య అందించడానికి వీలుంటుందన్నారు. 2019-20లో కళాశాలల ఫీజులు 35వేల రూపాయల నుంచి 1.08లక్షల రూపాయలుంటే... ఇప్పుడు గరిష్ఠంగా 70వేల రూపాయలు ఉండటం సరికాదన్నారు. అతితక్కువ ఫీజులతో నడిచే కళాశాలలు ఏపీలోనే ఉన్నాయనీ...రుసుములు పెంచకపోతే జీతాలు ఇవ్వలేమని ఆవేదన వ్యక్తం చేశాయి.

విద్యాలయాలను వ్యాపార దృక్పథంలో చూడకూడదని... ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య సూచించారు. సొసైటీల ద్వారా నిర్వహిస్తున్నందున వీటిని వేరుగా చూడాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఒకే ఫీజులు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల నిర్వహణ, శాశ్వత అనుబంధ గుర్తింపు, అధ్యాపకుల శిక్షణకు అకడమిక్‌ స్టాఫ్‌ కళాశాల ఏర్పాటుపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. ఫీజులపై కసరత్తు పూర్తయిన తర్వాత సమస్యలపై మరోసారి సమావేశం నిర్వహిస్తానని, అనంతరం సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: కాషాయమయంగా విజయవాడ రోడ్లు..బులెట్లపై భారతమాత వేషధారణలో మహిళలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.