ETV Bharat / city

సీఎం కేసీఆర్​ కారణజన్ముడు : ఎమ్మెల్యే రోజా

MLA Roja Yadadri Visit: ఎమ్మెల్యే రోజా తెలంగాణలోని యాదాద్రిని సందర్శించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న రోజా.. నూతనంగా నిర్మితమవుతున్న ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కట్టడాలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవట్లేదని అన్నారు.

MLA Roja Yadadri Visit
'సీఎం కేసీఆర్​ కారణజన్ముడు.. స్వామివారే ఆయన చేత గుడి కట్టించుకుంటున్నారు'
author img

By

Published : Feb 12, 2022, 5:34 PM IST

'సీఎం కేసీఆర్​ కారణజన్ముడు.. స్వామివారే ఆయన చేత గుడి కట్టించుకుంటున్నారు'

MLA Roja Yadadri Visit: భీష్మ ఏకాదశి సందర్భంగా తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని.. ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మితమవుతోన్న ఆలయాన్ని కలియతిరిగి పరిశీలించారు.

ఉట్టిపడుతోన్న శిల్పకళను చూసి పవరశించింపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవట్లేదని హర్షం వ్యక్తంచేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్​.. కారణజన్ముడని కితాబిచ్చారు.

"ఈ కాలంలో అద్భుతమైన రాతి కట్టడాలతో.. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా యాదాద్రి దేవాలయం రూపుదిద్దుకోవడం అద్భుతం. చూసేందుకు రెండు కళ్లూ సరిపోవడం లేదు. భీష్మ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో పవర్​ఫుల్​ దేవుడైన లక్ష్మీనరసింహ స్వామికి ఇంత గొప్ప గుడి కట్టించే అదృష్టం దక్కిందంటే.. సీఎం కేసీఆర్ నిజంగా కారణ జన్ముడే. ఆయన చేత స్వామివారే ఇంత గొప్పగా గుడి కట్టించుకుంటున్నారు. ఇది నిజంగా స్వామి వారి ఆశీర్వాదం. ఆయనతోపాటు ప్రజలందరిపైనా యాదాద్రీశుడి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా." - రోజా, ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.