విజయవాడ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా.. దిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లు, సర్ ఛార్జీలకు సంబంధించి పంపకాల సర్దుబాటు లేనందున రాష్ట్రాల ఆదాయం తగ్గుతోందని.. ఆర్దికమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్ కారణంగా ప్రజారోగ్యంపై ఎక్కువ మొత్తాలను వెచ్చిస్తున్న కారణంగా రాష్ట్ర వనరులపై భారం ఎక్కువైందని వివరించారు. ప్రాముఖ్యత ఉన్న అంశాలకు అంగీకారం తెలియచేస్తూ సరైన విధాన రూపకల్పన చేయాలని సూచించారు. పరిహారం విషయంలో ఏకాభిప్రాయం కోసం మరిన్ని సమావేశాలు నిర్వహించటంతో పాటు అధ్యయనం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో కుట్రకోణం ఉంటే తేల్చండి'