గత ప్రభుత్వ హయాంలో(ap high court on NREGA Bills) చేపట్టిన ఉపాధి హామీ, ఇతర కాంట్రాక్టు పనులకు సంబంధించి బకాయిల సొమ్మును నాలుగు వారాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సొమ్ము చెల్లింపులో విఫలమైతే 12 % వడ్డీతో చెల్లించాలన్న సింగిల్ జడ్జి తీర్పు అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేస్తూ.. ఇటీవల తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నాలుగు వారాల తర్వాత వాటంతట అవే ఎత్తివేతకు గురవుతాయని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కోసం నిర్మాణ సామాగ్రి నిమిత్తం చేసిన బకాయిలు(NREGA Pending Bills) చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వెయ్యికి పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. 12 శాతం వార్షిక వడ్డీతో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆప్పీల్లో ఇటీవల ధర్మాసనం విచారణ జరిపింది. 12 % వార్షిక వడ్డీతో బకాయిలు చెల్లించాలని సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేసింది . మరోవైపు ఉపాధి పనులపై విజిలెన్స్ విచారణ కారణంగా 21 % నిధుల్ని పట్టి ఉంచేందుకు వీలు కల్పిస్తూ.. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన రెండు మెమోలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపైన స్టే విధించింది. మరికొన్ని పిటిషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన ఆప్పీళ్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం(ap high court latest news on nrega) ముందుకు విచారణకు వచ్చాయి.
ఇదీ చదవండి:
CM Review: వరదలతో నష్టపోయిన 95 వేల కుటుంబాలకు పూర్తి సాయం: సీఎం