మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా ప్రభుత్వం మార్చటంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. మహిళా రక్షణ కార్యదర్శులను పోలీసులుగా తీసుకోవటం రాజ్యాంగంలోని 309 ఆర్టికల్ ప్రకారం విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, వై. బాలజీలు వాదనలు వినిపించారు. పోలీసు యాక్ట్ ప్రకారం కూడా విరుద్ధమన్నారు.
పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఒక పోస్టు కోసం భర్తీ చేసుకుని మరో పోస్టులో ఎలా నియమిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. పోలీసు నిబంధనలు ప్రకారం ఫిజికల్ పిట్నెస్, శిక్షణ లాంటి అంశాలు ఉంటాయి కదా అని గుర్తు చేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమవగా.. తాము అదనపు అఫిడవిట్ దాఖలు చేశామని.. వాటిని పరిశీలించాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి
మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్ డ్రెస్..ప్రభుత్వం నిర్ణయం