High Court on court building in Vijayawada: విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. నిర్మాణ విషయంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, నిర్మాణ సంస్థ శ్రీసత్యసాయి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ తదితరులను ఆదేశించింది.
త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. విజయవాడలోని కోర్టు భవన సముదాయ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి..
ధార్మిక పరిషత్ సభ్యుల తగ్గింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు