ETV Bharat / city

TRIBUTE TO GURAJADA: మహాకవి గురజాడకు గవర్నర్, సీఎం ఘన నివాళి - సీఎం జగన్

మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.

TRIBUTE TO GURAJADA
TRIBUTE TO GURAJADA
author img

By

Published : Sep 21, 2021, 4:24 PM IST

మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. నాటి సామాజిక సమస్యలపై గురజాడ తన సాహిత్యం ఆలంబనగా గళం విప్పారని అన్నారు. ప్రసిద్ధ తెలుగు నాటక రచయితగా, కవిగా ఆయన సేవలు నిరుపమానమని కొనియాడారు. 1892లో గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది తెలుగు భాషలో గొప్ప నాటకంగా అభివర్ణించారు. నేటికీ కన్యాశుల్కం నాటకాన్ని అజరామరంగా ప్రదర్శిస్తున్నారన్నారు. 1910లో గురజాడ రాసిన "దేశమును ప్రేమించుమన్న" అన్న దేశభక్తి గీతం ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు.

మహాకవికి సీఎం జగన్ నివాళులు..

మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. గురజాల ఓ సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుడని కీర్తించారు. ఆయన అందించిన సేవలను తెలుగునేతల మరువదని అభిప్రాయపడ్డారు.

  • మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుని మరువదు ఈ తెలుగునేల.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

Bonda Uma : వైకాపా నేతల మద్దతుతోనే సుధాకర్ డ్రగ్స్ వ్యాపారం: బోండా ఉమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.