కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు. 25న ఇవ్వనున్న టిడ్కో ఇళ్ల పంపిణీపై భాజాపా మత రాజకీయాలు చేస్తోందన్నారు. "క్రిస్మస్ రోజు పంపిణీ ఎలా చేస్తారని భాజాపా నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి అదే క్రిస్మస్ రోజు ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా జమ చేస్తారు." అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ వందల ఎకరాల్లో ఇల్లు కట్టుకొని..పేద ప్రజలకు మాత్రం సెంటు స్థలం ఇస్తామని చెప్పటం దారుణమన్నారు. కరోనా వ్యాక్సిన్ సాకుతో ఎన్నికలను వాయిదా వేయటం సబబు కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌పై కక్ష సాధింపులో భాగంగానే ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారని విమర్శించారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌతు లచ్చన్న విగ్రహన్ని తొలగిస్తామని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యనించటం పట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదీచదవండి