ఏపీ లాసెట్, ఎడ్‌సెట్ తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎడ్‌సెట్ మే 8న, లాసెట్ మే 9న నిర్వహించనున్నారు. వీటికి ఈనెల 28న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ నిమిత్తం సాఫ్ట్వేర్ సంస్థ ఎంపికకు ప్రభుత్వ అనుమతిలో జాప్యంవల్ల ఎంసెట్ నోటిఫికేషన్‌లో మార్పు జరిగిందని అధికారులు తెలిపారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు 25 లేదా 26న ఇవ్వాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ మార్పులతో దరఖాస్తుల స్వీకరణలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: