ETV Bharat / city

రేపు కేబినెట్ సమావేశం.. కరోనా కట్టడిపై కీలక చర్చ! - కేబినెట్ సమావేశం

రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు (మంగళవారం) సచివాలయంలో జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించే అవకాశం ఉంది.

ap Cabinet Meeting over corona issue
రేపు కేబినెట్ సమావేశం
author img

By

Published : May 3, 2021, 3:34 PM IST

ఇప్పటికే వేర్వేరు కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడిన రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు (మంగళవారం) సచివాలయంలో జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన మొదటి బ్లాక్​లోని సమావేశ మందిరంలో మంత్రివర్గం భేటీ కానుంది.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించే అంశాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాప్తి నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. వీటితోపాటు గతంలో పెండింగ్​లో ఉన్న వివిధ అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ఎల్లుండి నుంచి.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.