బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్కు జేఏసీ ఛైర్మన్ గుడూరు వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశాయని..వైకాపా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మళ్లీ అమలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం 2021 నాటికి జనాభా లెక్కలు తేలుస్తామని చెప్పి...ఇంకా చేయలేదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ జరిగే వరకూ స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసామన్నారు.
ఇదీచదవండి