ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై రెండో రోజూ అనిశా సోదాలు..సిబ్బందిలో గుబులు - krishna district news

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రెండోరోజూ అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ దేవాలయ పరిపాలన, ఇంజనీరింగ్‌, లడ్డూ, చీరల కౌంటర్‌లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇటీవల దుర్గగుడిలో వెల్లువెత్తుతున్న విమర్శలు, వివిధ టెండర్లలో అవినీతి ఆరోపణల ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Anti corruption officials
ఇంద్రకీలాద్రిపై రెండోరోజూ అనిశా సోదాలు
author img

By

Published : Feb 19, 2021, 8:22 PM IST

ఇంద్రకీలాద్రిపై రెండోరోజూ అనిశా సోదాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజూ అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. సెక్యూరిటీ, శానిటేషన్‌ సహా పలు టెండర్ల విషయంలో తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా అమ్మవారి ఆలయం చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా సాగుతున్న అనిశా సోదాలు సిబ్బందిలో గుబులు పుట్టిస్తున్నాయి.

అక్రమాల ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వివిధ విభాగాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాల ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ రెండోరోజూ సోదాలు కొనసాగిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అనిశా అధికారులు ఐదు బృందాలుగా గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. కొండపైన, కొండ దిగువన విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణ వీధిలోని ఈవో పేషీ, పలు విభాగాలతో పాటు పరిపాలన, ఇంజనీరింగ్‌, స్టోర్లు, లడ్డూ, చీరల కౌంటర్లపై ప్రధానంగా దృష్టి సారించారు. దస్త్రాలను పరిశీలించడంతోపాటు కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

గాడి తప్పిన దుర్గగుడిలో పాలన..
దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే టికెట్లలో సైతం గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు ఇటీవల వన్‌టౌన్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆలయంలో వివిధ పనుల కోసం పిలిచే టెండర్ల వ్యవహారాలపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌ వ్యవహారంపై అనిశాకు పలువురు ఫిర్యాదు చేశారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో... భద్రతా పరంగా ఇనుప మెష్‌ వేసి, సిమెంటు కట్టడాలు చేపట్టే పనుల్లోనూ అవకతవకలు జరిగాయనే విమర్శలున్నాయి. ఈ-ప్రొక్యూర్‌మెంటు విధానంలోనూ కమీషన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతకాలం నుంచి దుర్గగుడిలో పాలన గాడి తప్పిందని భక్తులతోపాటు వివిధ రాజకీయ పక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి.

కాంట్రాక్టులన్నీ అనుకూలమైన సంస్థకు..

దేవస్థానానికి చెందిన శానిటేషన్‌ కాంట్రాక్టును కూడా తమకు అనుకూలమైన సంస్థకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేశారని విమర్శలు వచ్చాయి. దుర్గగుడిలో ఉద్యోగులకు పదోన్నతుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని ఎప్పటినుంచో విమర్శలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తాజాగా మొత్తం ప్రక్షాళన చేస్తున్నామన్నట్టుగా అధికారులు హడావుడి చేశారు. ఆలయంలోని కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగిస్తున్నట్టు పత్రాలను సిద్ధం చేశారు. 54మందికి అంతర్గత బదిలీలు చేస్తున్నట్టు జాబితాను ఈ నెల 11న విడుదల చేశారు. కానీ ఆ జాబితాలో నలుగురు సూపరింటెండెంట్‌లు సహా కేవలం 9మంది సిబ్బందికి మాత్రమే విధులను మార్చారు. వీటన్నింటి నేపథ్యంలో మీడియాలో వచ్చిన కథనాలు... అనిశా దృష్టికి వెళ్లిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సోదాలు జరుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కొవిడ్ టీకా వేయించుకున్న జాయింట్ కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.