విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం పంపిణీ కార్యక్రమం పునః ప్రారంభమైంది. దేవస్థానం మల్లికార్జున మహా మండపం రెండో అంతస్తులో భక్తులు అన్నప్రసాదం స్వీకరించే కార్యక్రమాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్భముళ్ల భ్రమరాంబ ప్రారంభించారు. అమ్మవారి భక్తులకు అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు.
కరోనా సమయంలో భక్తులు కూర్చొని అన్నప్రసాదం తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్యాకెట్ల రూపంలో భక్తులకు ప్రసాదం అందజేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గినందున మళ్లీ అన్నదాన కార్యక్రమాన్ని పునరుద్ధరించామని పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Srisailam : శ్రీశైలంలో దేదీప్యంగా లక్ష దీపోత్సవం