ETV Bharat / city

'అంతిమ విజయం సాధించే వరకూ.. అమరావతి రైతులకు అండగా ఉంటాం' - అమరావతి వార్తలు

విజయవాడలోని ఎంబీవీకే భవన్ లో ఆంధ్రుల రాజధాని అమరావతి ద్వితీయ ముద్రణ పుస్తకాన్ని తెదేపా ఎన్నారై కో ఆర్డినేటర్ కోమటి జయరామ్​తోపాటు ముఖ్యులు ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని సాధించేవరకు ఎన్నారైలు అండగా ఉంటారని స్పష్టంచేశారు.

capital Amravati book
capital Amravati book
author img

By

Published : Apr 17, 2022, 4:59 AM IST

Updated : Apr 17, 2022, 5:34 AM IST

అమరావతి పోరాటంలో అంతిమ విజయం సాధించేవరకూ రైతులకు అండగా ఉంటామని ఎన్‌ఆర్‌ఐ తెదేపా సమన్వయకర్త కోమటి జయరామ్‌ పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం మాదిరే.. రాష్ట్రానికి వైకాపా గ్రహణం పట్టింది. అమరావతికి కుల, మతాల్ని అంటగట్టి నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నియంత పాలన పోయేవరకూ పోరాడాలి’ అని రైతులకు సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన ‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ పుస్తక ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరావతి చరిత్రను పుస్తక రూపంలో తేవడం అభినందనీయమని, డిజిటల్‌లోనూ అందుబాటులో ఉంచితే మరింత మందికి చేరువ అవుతుందన్నారు. ‘ఎన్‌ఆర్‌ఐలుగా అమరావతికి చేయగలిగినంత చేస్తున్నాం.. ఈ ప్రాంతానికి మా వంతు సేవ చేయడం గొప్పతనం కాదు, బాధ్యత’ అన్నారు.

ఎవరి రాజధాని చదివాకే.. అమరావతిపై పుస్తక ఆలోచన వచ్చింది

మేమేమీ పెద్ద రచయితలం కాదు.. ఎవరి రాజధాని అమరావతి అని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన పుస్తకం చదివాక.. కన్నీళ్లు తిరిగాయి. రాజధాని రైతుల త్యాగాలను అవమానించేలా తప్పుడు కథ]నాలు రాస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అర్థమైంది. వాస్తవాలను వెలుగులోకి తేవాలనే ‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ పుస్తకం తెచ్చాం. దీని తొలి ముద్రణ కోసం మాకున్న స్థలాన్ని రూ.4.50 లక్షలకు అమ్మాం. 2019లో చంద్రబాబు చేతులమీదుగా ఆవిష్కరించాం. మరిన్ని మార్పులతో ద్వితీయ ముద్రణకు కోమటి జయరాం, జాగర్లమూడి శివాని, ఉప్పుటూరి రామ్‌చౌదరి.. వీరంతా సహకరించారు.- ఉన్నం బద్రర్స్‌, పుస్తక రచయితలు

పుస్తక ట్యాగ్‌లైన్‌గా రూపశిల్పి చంద్రబాబు

‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ పుస్తక ట్యాగ్‌లైన్‌గా రూపశిల్పి, నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. తెలుగు వారి తొలి రాజధానిగా అమరావతి, వాసిరెడ్డి వెంకట్రాద్రినాయుడు పాలన, ఆంధ్ర ప్రశస్తి, రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించడం, భూసమీకరణ, ప్రధాని మోదీ శంకుస్థాపన తదితర అంశాలను వివరించారు. రాజధానిలో భూముల కేటాయింపు, భవన ఆకృతులు, అభివృద్ధి కార్యక్రమాలు, నగర నిర్మాణానికి ప్రజల విరాళాలు, చంద్రబాబుకు ప్రముఖుల ప్రశంసలు, పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు, వివిధ ప్రభుత్వ సంస్థల ఏర్పాటును చిత్రాలతో తెలియజేశారు.

ఇంటర్‌తో ఆపిన వ్యక్తికి రెవెన్యూ మంత్రి పదవి
అమరావతికి సంబంధించి హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చ పెట్టిన వ్యక్తికి రాష్ట్ర మంత్రిపదవి ఇచ్చారు. అదే ఆయనకు అర్హత అయింది. చదువురాక ఇంటర్‌తో ఆపేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఐఏఎస్‌, ఇతర రెవెన్యూ అధికారులకు మంత్రి. అమరావతిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతిపై పోరాట రూపు మారాలి- తాడికొండ శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే

జగన్‌ను గద్దె దించడం ద్వారా అమరావతిని నిలబెట్టాలి

అమరావతిని అభివృద్ధి చేస్తామని జగన్‌ ముందుకు రావాలి.. లేదంటే ఆయన్ను గద్దె దించడం ద్వారా అమరావతిని నిలబెట్టుకోవడానికి సిద్ధం కావాలి. కోర్టు తీర్పును అమలుచేసేలా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. మహిళలే లేకపోతే, 851 రోజుల ఉద్యమమే సాగకపోతే అమరావతికి ఈనాటి ఆత్మస్థైర్యమూ ఉండేది కాదు. - ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

పచ్చి బాలింతరాల్ని పొత్తికడుపుపై తన్నారు..

పచ్చి బాలింతరాల్ని పొత్తికడుపుపై తన్నిన రాజ్యంలో జీవిస్తున్నందుకు బాధపడుతున్నా. అమరావతి రైతులకు న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. త్వరలోనే దేవస్థానమూ తీర్పు ఇవ్వబోతోంది. గోవిందనామ స్మరణ చేసే ప్రదేశంలో డౌన్‌డౌన్‌ అనే మాటలు వినిపించాయి. పతనం మొదలైంది. అమరావతిపై విషం కక్కేవారంతా ఆంధ్రప్రజలకు శత్రువులే. వారిని ఎప్పటికైనా దూరంగా పెట్టాల్సిందే.- అడుసుమల్లి శ్రీనివాసరావు

అమరావతిని కాలదన్నిన వాళ్లే.. రైతుల కాళ్లదగ్గరకొస్తారు

అమరావతిని కాలదన్నిన వాళ్లు.. రైతుల కాళ్ల దగ్గరకు వచ్చి బతిమిలాడే రోజులు త్వరలో వస్తాయి. రాజధాని రూపశిల్పి చంద్రబాబు అని అంగీకరిస్తున్నా. అమరావతిని వ్యతిరేకించేవారు ఇప్పటికైనా మారాలి.- వెలగపూడి గోపాలకృష్ణ

రాజధానిని ముక్కలు చేయడం వికేంద్రీకరణ కాదు

రాజధానిని ముక్కలు చేయడం వికేంద్రీకరణ కాదు. కోర్టు తీర్పుల్నీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చీల్చాలని చూస్తోంది. కోర్టులో విజయం సాధించడం ద్వారా ఒక మెట్టు మాత్రమే ఎక్కాం. మరెన్నో మెట్లు ఎక్కాలి. ప్రజా ఉద్యమం ద్వారానే ప్రభుత్వాల్ని కదిలించగలం.- సీహెచ్‌ బాబూరావు, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు

అమరావతి భూమిపైనా మచ్చ వేసిన జగన్‌

అమరావతిలో అన్ని వర్గాల ప్రజలూ ఉన్నారు. ఎస్సీల నియోజకవర్గమని, మునిగే ప్రాంతమని, పునాదులు బలహీనమంటూ రాజధాని భూమిపైనా మచ్చవేసే ప్రయత్నం చేశారు. అభివృద్ధిని 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. కోర్టు తీర్పు ఇచ్చినా జగన్‌ మొండివైఖరి విడనాడలేదు. పోరాటం కొనసాగించాలి.- మార్టిన్‌ లూథర్‌, దళిత జేఏసీ నాయకులు

పిల్లల చదువుల నుంచి కరోనా వైద్యం వరకు శివాని సాయం

‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ ద్వితీయ ముద్రణకు సహకారం అందించిన జాగర్లమూడి శివాని.. రాజధాని ప్రాంత ప్రజలకు ఎంతో చేయూత అందిస్తున్నారు. మా బాధల్ని తమవిగా భావించి కరోనా సమయంలో వైద్యం, ఆక్సిజన్‌, మందులు అందేలా చూశారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్దినులకు ఉపకార వేతనాలు ఇస్తున్నారు. 150 మందికి సైకిళ్లు అందించారు. అమరావతిలో ఏ అవసరం వచ్చినా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆమె మా మనసుల్లో ఉన్నారు. రామ్‌చౌదరి ఎంతో సహకరించారు.- కంభంపాటి శిరీష, అమరావతి మహిళా ఐకాస నాయకురాలు

పార్టీపై కక్షతో రాజధానిని నిర్వీర్యం చేసే కుట్ర

అమరావతిపై హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. రాజధాని అభివృద్ధికి సమయం నిర్దేశించింది. అయినా లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వం.. శాసనసభలో చర్చ పెట్టింది. మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. ఒక పార్టీపై కక్షతో రాజధానిని నిర్వీర్యం చేయాలని కుట్రపన్నింది. అమరావతిని స్ఫురణకు తెచ్చేలా పుస్తకాన్ని రూపొందించారు.- పువ్వాడ సుధాకర్‌, అమరావతి రైతు ఐకాస కన్వీనర్‌

.
ఇదీ చదవండి: "మంత్రి వ్యాఖ్యలు బాధించాయి.. నిజాయితీతో పనిచేసే మమ్మల్ని నిరుత్సాహ పర్చొద్దు"

Last Updated : Apr 17, 2022, 5:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.