ఆ యువకుడు అనాథ... విజయవాడ అలంకార్ సెంటర్లో ఉంటాడు. ఏదైనా చేద్దామంటే కాళ్లు, చేతులు సహకరించవు. లాక్‌డౌన్ నేపథ్యంలో 3 రోజుల నుంచి ఆకలితోనే ఉండిపోయాడు. గోరుముద్ద సెంటర్ దగ్గర అమృతహస్తం ఆధ్వర్యంలో వాలంటీర్లు కొందరు నిత్యం అన్నదానం చేస్తుంటారు. శనివారం అన్నదానం చేస్తుండగా... అక్కడికి దగ్గర్లోనే ఆ యువకుడు ఉన్నాడని తెలిసింది. వాలంటీర్లలోని ఓ మహిళ పళ్లెంలో భోజనం తీసుకెళ్లి, ముద్దలు కలిపి అతనికి తినిపించారు.
ఇవీ చదవండి: