ETV Bharat / city

చిరివేళ్ళ సేవలు ఆదర్శనీయం : ఎమ్మెల్యే సింహాద్రి - challapalli news

సమాజ మార్పు కోసం ఉద్యోగాన్ని సైతం వదిలి...అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న చిరివేళ్ల రాఘవరావు సేవలు ప్రశంసనీయమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో జాతీయ అవార్డు గ్రహీత చిరివేళ్లకు అంబేడ్కర్ అభిమానుల ఆధ్వర్యంలో సత్కారం చేశారు.

Ambedkar fans felicitated National Award recipient Chirivella in Krishna district Challapalli.
చిరివేళ్ళకు సత్కారం
author img

By

Published : Aug 18, 2020, 3:50 PM IST

జీవితాంతం ఎస్సీల అభ్యున్నతి, అంబేడ్కర్ ఆశయ సాధన కోసం పని చేస్తున్న చిరివేళ్ల రాఘవరావు ఆశయాలు అదరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో అవనిగడ్డ నియోజకవర్గం అంబేడ్కర్ అభిమానుల ఆధ్వర్యంలో... జాతీయ అవార్డు గ్రహీత చిరివేళ్ల రాఘవరావుకి ఘన సత్కారం చేశారు. ఏడు పదుల వయసులోనూ సమాజ సేవ కోసం చిరివేళ్ల పరితపిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన ఆశయాలు యువతకు ఆదర్శం కావాలన్నారు.

సమాజం కోసం ఉద్యోగాన్ని విడిచి...

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి సమాజ మార్పు కోసం పని చేస్తున్న చిరివేళ్ల రాఘవరావు లాంటి గొప్ప వ్యక్తులు ఆరుదుగా ఉంటారని కృష్ణాజిల్లా స్పెషల్ ఎన్​ఫోర్స్ మెంట్ బ్యూరో ఏఎస్పీ మోకా సత్తిబాబు చెప్పారు. 500కు పైగా అంబేడ్కర్ విగ్రహాలు, ఎనిమిది వేల అంబేడ్కర్ చిత్రపటాలను చిరివేళ్ల ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. అంబేడ్కర్ కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం కమ్యునల్ అవార్డు ప్రకటించడం ద్వారా ఎస్సీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఈరోజున చిరివేళ్ల రాఘవరావుని సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఊపిరి ఉన్నంత వరకు కొనసాగిస్తా....

రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు ఎన్నో హక్కులు కల్పించిన బీఆర్ అంబేడ్కర్ ఆయా వర్గాలకు దేవుడని సత్కార గ్రహీత చిరివేళ్ల రాఘవరావు అన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు అంబేడ్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తూ.. ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ఆయనకు చిరివేళ్ల అభిమానులు సమకూర్చిన రూ.1.44 లక్షల నగదు అవార్డు చెక్కుని ఎమ్మెల్యే సింహాద్రి, ఏఎస్పీ సత్తిబాబు అందజేశారు. తొలుత ప్రముఖ బౌద్ధ భిక్షు ధమ్మ ధజ బంతేజీ బుద్ద వందనం, ధర్మసందేశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.