ఐఆర్ఎస్ అధికారి, ఈడీబీ మాజీ సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్‌పై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. తప్పు చేశారని.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా కొందరు ఎక్కువగా స్పందిస్తున్నారని అంబటి అన్నారు. జగన్‌పై సీబీఐ కేసుల్లో చంద్రబాబుతో కృష్ణకిషోర్ కుమ్మక్కైనట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిని చంద్రబాబు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. మరోవైపు అసెంబ్లీ ఆవరణలో ఘర్షణ వాతావరణం సమంజసనీయం కాదని వ్యాఖ్యానించారు. అవసరమయితే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా మార్షల్స్ తనిఖీ చేస్తారన్నారు. సీనియర్ నేతగా చంద్రబాబుకు ఇవన్నీ తెలిసే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి:
ఐఆర్ఎస్ అధికారి సస్పెండ్... అమరావతి విడిచి వెళ్లొద్దని ఆదేశాలు