వైకాపా ప్రభుత్వంలోని మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా కార్పొరేటర్ల అభ్యర్థులను నగరపాలక సంస్థల్లోకి పిలిచి సమీక్షలు జరిపారని ఆరోపించారు.
నగరంలో విచ్చలవిడిగా హోదా లేని వైకాపా నాయకులూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్నారు. మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ తరహా చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమవంతు కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి: జగ్గయ్యపేటలో సందడిగా ఎలక్ట్రీషియన్స్ డే